మంత్రి పొంగులేటి కి తృటిలో తప్పిన పెను ప్రమాదం ..
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఇవాళ భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సు నిమిత్తం నాగర్‌కర్నూల్ జిల్లాకు మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్‌కుమార్ హెలికాప్టర్‌లో వచ్చారు.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది.
వివరాల ప్రకారం.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి శనివారం నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించారు.
భూ భారతిపై రెవెన్యూ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులు వచ్చారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో హెలిపాడ్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది.
వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. మంటలను ఆర్పి వేశారు. అయితే, హెలికాప్టర్ ల్యాండ్ కోసం ఇచ్చిన సిగ్నల్ బుల్లెట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Comments
Post a Comment