సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ

 *సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ చందాయి పేటలో* 


 *C K న్యూస్ చేగుంట రిపోటర్* *కొండి శ్రీనివాస్* *జనవరి 25* 

*మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ఈరోజు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ అధ్యక్షతన గ్రామసభ మరియు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఈరోజు గ్రామంలో ప్రతిజ్ఞ చేసి గ్రామస్తులకు ఓటు విలువ గురించి తెలపడం జరిగింది. 


అలాగే గ్రామ సభ నిర్వహించి గ్రామం యొక్క సమస్యలను అలాగే జిపిడిపి ప్లాన్ గురించి చర్చించుకోవడం జరిగింది.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, సెక్రెటరీ కృష్ణ,జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం కృష్ణ, ఎంపీపీఎస్ స్కూల్ హెచ్ఎం ఊర్మిళ,ఏఎన్ఎం సెకండ్ నవనీత,ఆశవర్కర్లు, అంగన్వాడి టీచర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు*

Comments