మహిళా కానిస్టేబుల్‌ని ఈడ్చిపడేసిన అంగన్వాడీ కార్యకర్తలు...

*మహిళా కానిస్టేబుల్‌ని ఈడ్చిపడేసిన అంగన్వాడీ కార్యకర్తలు..*

*ఛలో విజయవాడ’కు వెళ్తుండగా అడ్డుకోవడంపై అంగన్వాడీల ఆగ్రహం*

*రోడ్డుపై అడ్డగించడంతో ‘మీరు కూడా రోడ్డు మీద కూర్చోండి’ అంటూ మహిళ కానిస్టేబుల్‌పై కార్యకర్తల ఆగ్రహం*

తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు.. విధుల్లో చేరనివారిని తొలగించాలంటూ జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు.. వెరసి ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. 


ప్రభుత్వ వైఖరికి నిరసనగా ‘ఛలో విజయవాడ’కు పిలుపునివ్వడంతో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. చాలా చోట్ల కార్యకర్తలను రోడ్లపై నిలువరించారు. 

ఈ క్రమంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ చోట పోలీసులపై అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఎంతసేపు కూర్చొబెడతారంటూ మండిపడ్డారు. ‘మీరు కూడా రోడ్డు మీద కూర్చోండి’ అంటూ మహిళా కానిస్టేబుళ్లను అంగన్వాడీ కార్యకర్తలు ఈడ్చిపడేశారు.

Comments