రేపే 10th ఫలితాలు
పదవ తరగతి పరీక్ష ఫలితాలకు రంగం సిద్ధం అయింది. ఫలితాలు విడుదలకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వానికి అధికారులు చెప్పారు.
సబ్జెక్టుల వారీగా ఇంటర్నల్ మార్కులు, ఎక్స్‌టర్నల్ మార్కులు, మొత్తం మార్కులతో SSC పాస్ సర్టిఫికెట్ జారీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా, పదో తరగతి మెమోలో చివరగా పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే ఫెయిల్ అని మాత్రమే ఉంటుంది. ఫలితాల్లో టోటల్ మార్క్స్, గ్రేడ్ ఉండదని అధికారులు అంటున్నారు.
అయితే, రేపు (ఏప్రిల్ 30న) ఫలితాలను విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నమని అధికారులు అంటున్నారు. ఇక, ఫలితాలు ఏ రోజు విడుదల చేయాలి అనేది ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
కాగా, మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
Comments
Post a Comment