ఉగ్రవాద సంస్థలను ఏరివేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలి.
మాజీ ఎంపీటీసీ రేఖల ప్రభాకర్ గౌడ్ టేకుల సోమవారం గ్రామం.
సి కె న్యూస్ వలిగొండ మండలం ప్రతినిధి బాలరాజు ఏప్రిల్ 24.
మీడియాతో మాట్లాడుతూ.
పహాల్గాం ఘటన అత్యంత బాధాకరం అని
ఆవేదన వ్యక్తం చేశారు.
భారత పర్యటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి సుమారు 30 మంది వరకు చంపివేయడం ఉగ్రవాదుల దుశ్చర్య క్షమించరాన్ని నేరమని తెలిపారు. కాశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలను ఏరివేసేందుకు కేంద్రం కృషి చేయాలని సూచించారు. భారతదేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఈ ఘటనను ఉగ్రవాదులు కుట్రలు పన్నా రని అనుమానం వ్యక్తం చేశారు. భారతదేశంలో అన్ని మతాలవారు కలిసిమెలిసి ఉండడం జీర్ణించుకోలేక దేశంలో మతకల్లోలం సృష్టించేందుకు కొందరు విదేశీయులు కుట్ర పన్నారని వారిని కేంద్ర ప్రభుత్వం విడిచిపెట్టకూడదని కోరారు. భారతదేశంలో ప్రతి పౌరుడు దేశానికి ఇలాంటి సమయంలో అండగా నిలబడతాడని తెలిపారు. ఇలాంటి దుశ్చర్యలతో ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. పర్యటకులను హత్య చేయడం భాధకరం దీనిని కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోకూడదని ఉగ్రవాదులను అంతమొందించాలని డిమాండ్ చేశారు. ఎవరిని కుట్రలు పన్నినా భారత్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదని మతాల మధ్య చిచ్చు పెట్టలేరని హెచ్చరించారు. దేశం లోని ప్రతి పౌరుడు అండగా నిలబడి ఐకమత్యంతో ఉండి ఉగ్రవాదులను దేశం నుండి తరిమికొట్టే వరకు వెనకడుగు వేయకూడదని పిలుపునిచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు...
Comments
Post a Comment