భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య...
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న సంఘటన హైదరాబాద్ లో తెరపైకి వచ్చింది. అయితే ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య...చాకచక్యంతో వాళ్ళిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నిలదీసింది. అనంతరం వాళ్ళను మీడియా ముందుకు లాగింది.
తనకు న్యాయం చేయాలని అక్కడే రచ్చ రచ్చ చేసింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శివ .. నాలుగు సంవత్సరాల కిందట ఆ పెళ్లి చేసుకున్నాడు.
దీప్తి అనే ఓ మహిళను పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు మూడేళ్ల పాప కూడా ఉంది. అయితే గత కొంతకాలంగా... దీప్తికి దూరంగా ఉంటున్నాడు శివ. సరైన కారణం చెప్పకుండానే... భార్యను వదిలేశాడు.
ఈ నేపథ్యంలోనే ఒంటరిగా ఉంటున్న శివ... సుష్మ అనే మహిళకు దగ్గరయ్యాడు. వాళ్ళిద్దరూ.. గత కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గమనించిన దీప్తి... వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని డిసైడ్ అయింది.
ఇందులో భాగంగానే సుష్మతో కూకట్ పల్లి లో నివాసం ఉంటున్నాడని, శివ అడ్రస్ కనిపెట్టింది.
అనంతరం... తాజాగా తన బంధువులతో రంగంలోకి దిగిన దీప్తి... శివ బండారం బయటపట్టింది. శివ అలాగే సుష్మ ఇద్దరు బెడ్ రూమ్ లో ఉన్నప్పుడే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది దీప్తి.
తనకు న్యాయం చేయాలని పోలీసుల ముందే పంచాయతీ పెట్టుకుంది. ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి పోలీసులు ఈ సంఘటన లో ఇలా ముందుకు వెళ్తారో చూడాలి.
Comments
Post a Comment