*పెద్దమ్మ తల్లి పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం లో హై టెన్షన్*
*భట్టి V/S పొంగులేటి వర్గాల మధ్య వాగ్వాదం*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దమ్మ తల్లి పాలక మండలి ప్రమాణ స్వీకారం లో భట్టి పొంగులేటి అనుచరుల వాగ్వాదం చోటు చేసుకుంది
తమ గ్రామానికి పాలకమండలిలో చోటుకల్పించలేదంటూ కేశవాపురం యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.
భారీగా మోహరించిన పోలీసులు..
ఈ క్రమంలోనే పాలకమండలి ప్రమాణస్వీకారాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తూ ఆలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకోగా.. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ప్రమాణస్వీకారం చేశారు పాలకమండలి సభ్యులు.
మొదట డిప్యుటీ సీఎం భట్టివిక్రమార్క అనుచరుడు జమ్ముల రాజశేఖర్ ను ఆలయ చైర్మన్ గా నియమిస్తూ సభ్యులతో కూడిన నియామకపత్రం విడుదల చేసింది దేవాదాయ ధర్మాధాయ శాఖ. అయితే ఇటీవల పాలకమండలిలో చోటు దక్కించుకుని ప్రమాణ స్వీకారానికి సిద్ధమైంది పొంగులేటి వర్గం. అయినప్పటికీ నూతన పాలకమండలి జాబితాలో తమ గ్రామానికి చోటుకల్పించకపోవడంపై కేశవాపురం గ్రామస్థులు కొద్దిరోజులుగా ఆందోళనకుదిగారు. తమ గ్రామంలో వెలసిన అమ్మవారి ఆలయ పాలకమండలిలో ఊరికి అవమానం జరిగిందంటూ నిరసనలు చేప్టటారు. ఇందులో భాగంగానే ఈరోజు పాలకమండలి ప్రమాణస్వీకారాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. అయినప్పటికీ తీవ్ర ఉద్రిక్తతల నడుమ భారీ బందోబస్తుతో పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయ పాలకమండలి ప్రమాణస్వీకారం ముగిసింది.
Comments
Post a Comment