మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

మహేష్ బాబుకు ఈడీ నోటీసులు


ఏప్రిల్ 27 న విచారణకు హాజరు కావాలని ఆదేశం


హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చేసిన వాణిజ్య ప్రకటనలకు మహేష్ బాబు రూ.5.9 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్టు ఆరోపిస్తున్న ఈడీ అధికారులు


హైదరాబాద్ చెందిన సాయి సూర్య డెవలపర్స్ తో పాటు సురానా గ్రూపు కంపెనీ వ్యవహారంలో ఈడి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది ..సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ కోసం మహేష్ బాబు ప్రమోషన్ నిర్వహించాడు.. ఇందు కొరకు 5.9 కోట్ల రూపా యల డబ్బుని మహేష్ బాబు, తీసుకున్నట్లు సమాచారం.


ఇందులో కొంత నగదు రూపంలో తీసుకోగా మరి కొంత ఆర్టిజిఎస్ రూపంలో ట్రాన్స్ఫర్ అయింది.. అయితే ఈ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు సాయి సూర్య డెవలపర్స్ సురానా కంపెనీలో ఈ డి సోదాలు నిర్వహించిన ప్పుడు బయటపడింది ..


సోదాలు దొరికిన పత్రాల ఆధారంగా మహేష్ బాబుకి ఈడి నోటీసులు ఇచ్చింది.. సాయి సూర్య డెవలపర్స్, సురానా కంపెనీలు పెద్ద మొత్తంలో వెంచర్ల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి.. 


ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు గతంలోని సాయి సూర్య డెవలపర్స్ చైర్మన్ సతీష్ గుప్తను అరెస్టు చేశారు.. అదే మాదిరిగా సూరానా గ్రూపు పైన కూడా కేసు నమోదు చేశారు.. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈ డి విచారణ ప్రారంభించింది.. 

ఈ నేపథ్యంలోనే ఈనెల 16వ తేదీన ఈడి రెండు రోజులపాటు సాయి సూర్య డెవలపర్స్ , సూరన గ్రూపు లో సోదాలు నిర్వహించిన సంగతి పాఠకులకు తెలిసిందే.

Comments