'ఊరికే అరవకు.. దమ్ముంటే అక్కడికి రా'! కేటీఆర్‌కు ఈటల సవాల్
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకరికొకరు ప్రతిపక్షం అని చెప్పుకుంటారు.. బీజేపీ వేగాన్ని తట్టుకోలేక మీదికి కొట్టుకుంటూ లోపల కలిసి ఉంటారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.
ఎమ్ఐఎమ్, BRS, కాంగ్రెస్ అన్నీ కుటుంబ పార్టీలని.. బీజేపీ ఒక్కటే ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పారు. చాయ్ అమ్ముకునే వ్యక్తిని బీజేపీ ప్రధాన మంత్రిని చేసిందని గుర్తుచేశారు.
ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా నిలబెడితే ఓడిపోతామని తెలిసి కూడా తట్టుకోలేక పోటీ పెట్టారని అన్నారు. దళిత బిడ్డ రామ్‌నాథ్ కోవింద్ మీద కూడా పోటీ పెట్టారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ పార్టీలన్నీ ఒకే తాను ముక్కలని చెప్పారు.
ప్రస్తుతం బెంగాల్‌లో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు.. హైదరాబాద్ కూడా అలా మారాలంటే ఎమ్ఐఎమ్‌కు ఓటు వేయాలని కార్పొరేటర్లకు సూచించారు. హైదరాబాద్‌లో వక్ఫ్ పేరు మీద వేల కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయని అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు బీజేపీ.. దేశహితం బీజేపీ సిద్ధాంతమని చెప్పారు. కార్పొరేటర్లారా చూస్తూ చూస్తూ బొందలపడకండి అని అన్నారు. 'బాంబుల మోతలు, ఎగిరిపడ్డ మాంసం ముద్దలు లేకుండా ఉండాలంటే బీజేపీకి మద్దతు ఇవ్వండి' అని పిలుపునిచ్చారు.
దేశ ఐక్యత, సమగ్రత, ఆడబిడ్డలను కాపాడాలని కోరుతున్నట్లు చెప్పారు. బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా అది దేశం కోసమే అని అన్నారు. పదేళ్ల బీజేపీ పాలన మీద అబిడ్స్ చౌరస్తాలో చర్చకు రావాలని కేటీఆర్ కు సవాల్ చేశారు.
అనవసరంగా పదే పదే కేంద్రం నిధులు ఇవ్వడం లేదని గగ్గోలు పెట్టడం, ఫాల్స్ మాటలు మాట్లాడటం కాదు.. దమ్ముంటే చర్చకు చెబుతా అని ఛాలెంజ్ చేశారు. సీఎం, మంత్రులు ఇతర దేశాలకు వెళ్లినప్పుడల్లా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని గొప్పలు చెప్పుకోవడమే కానీ.. ఇప్పటివరకు ఒక్కటి రాలేదని అన్నారు.
Comments
Post a Comment