భారత ప్రజలు ఐక్యంగా నిలబడి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలి.

 భారత ప్రజలు ఐక్యంగా నిలబడి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలి.





 బిజెపి పార్టీ జిల్లా నాయకులు కొప్పుల యాదిరెడ్డి వర్కుడు పెళ్లి గ్రామం.





 సి కె న్యూస్ వలిగొండ మండలం ప్రతినిధి బాలరాజు ఏప్రిల్ 24.


బిజెపి పార్టీ జిల్లా నాయకులు కొప్పుల యాదిరెడ్డి వర్కుడుపెళ్లి గ్రామం .

మీడియాతో  మాట్లాడుతూ “ఇది యుద్ధం కాదు… ఇది మతంపై, మానవత్వంపై, శాంతిపై విరూపమైన దాడి. అమాయక హిందూ పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకొని కాల్చి చంపిన విధానం పైశాచికం. ఉగ్రవాదుల ఈ పాశవిక చర్య మానవ చరిత్రలో మచ్చలేని ముద్రగా నిలవనుంది,” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “భారతదేశం శాంతి, సంస్కృతి, సహనానికి నిలయమైన దేశం. ఇలాంటి దాడులు మన విలువలకు సవాళ్లుగా మారుతున్నాయి. ప్రజలంతా ఐక్యంగా నిలబడి ఈ అసూర శక్తుల్ని ఎదుర్కొనాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి పౌరుడు ఈ ముప్పును సీరియస్‌గా తీసుకోవాలి,” అంటూ పిలుపునిచ్చారు.


“పుణ్యభూమిలో శాంతిని ఛిద్రం చేయాలనే కుట్రలు సాగుతున్నాయి. కానీ చీకటికి ఎప్పుడూ వెలుతురు గెలుస్తుంది. భారతీయుల ఐక్యతే చివరికి విజయం సాధించనుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో సుమారు 30 మంది వరకు మృతిచెందినట్లు, ఎంతోమంది తీవ్రంగా గాయపడినట్లు, ఇంకా కొంతమంది చావుబతుకుల మధ్య పోరాడుతున్నారనీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో,

“ఉగ్రవాదులపై చర్యలకు ఆర్మీ ఏవిధంగా ముందుకు వెళ్లినా మేమంతా ఆ పరాక్రమానికి అండగా నిలుస్తాం. మానవతా విలువలకు మద్దతుగా, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగస్వాములమవుతాం,” అని స్పష్టం చేశారు.

“ఇప్పుడు సమయం ఒకటే... ఉగ్రాన్ని తుడిచిపెట్టాలి.  ప్రపంచం మొత్తం కలసి ఈ అసహ్య ఉగ్రవాద ధోరణులకు చెక్ పెట్టాలి. అమాయకుల జీవితాల్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులకు మనం తగిన బుద్ధి చెప్పాలి" అని మీడియాతో అన్నారు.

Comments