ఎలుకల మందు తాగిన భార్యభర్తలు.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న జంట ఆరు నెలల తర్వాత ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటనలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన మండలంలో వెంకట్యా తండాలో చోటు చేసుకుంది.
టేకులపల్లి ఎస్సై ఆలకుంట రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి మండలం దాస్ తండా గ్రామ పంచాయతీ పరిధి రేగుల తండా గ్రామానికి చెందిన ఇస్లావత్ వత్మల్ కుమార్తె అయిన ఇస్లావత్ దీపిక ( 19)ఆరు నెలల క్రితం టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామ పంచాయితీ వెంకట్యాతండా గ్రామానికి చెందిన బోడ వీరు, చిలికిల కుమారుడు బోడ శ్రీను అనే యువకుడుతో ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం దీపిక మూడు నెలల గర్భవతి.
గత రెండు నెలల నుంచి దీపిక భర్త బోడ శ్రీను ఆమె అత్త మామలు బోడ చిలికి, బోడ వీరులతో పాటు వారి కుటుంబ సభ్యులు కట్నం తీసుకురమ్మని వేధించారని తెలిపారు. అంతే కాకుండా ఈ నెల 24వ తేదీ(నిన్న) మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో వారందరూ కలిసి దీపికతో గొడవ పడి ఆమెను తిట్టి , కొట్టారని సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో దీపిక భర్త బోడ శ్రీను మజా బాటిల్ లో గడ్డి మందు, ఎలుకల మందు కలుపుకొని తాగడని వారు చెప్పడంతో దీపిక కూడా ఆ గడ్డి మందు, ఎలుకల మందు కలిపిన మజాను తాగడం జరిగిందని అన్నారు. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్ లో చేర్పించగా దీపిక ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు మరణించిందని దీపిక తండ్రి ఇస్లావత్ వత్మల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆలకుంట రాజేందర్ తెలిపారు.
Comments
Post a Comment