*కడుపు ఎందుకు మండుతోంది కేసీఆర్...!
*
- *ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా లేక ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా...?*
- *పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే చాలు....మీరు వారికి ధరణి చట్టాన్ని చట్టం చేశారు*
- *అనాలోచితంగా .... ఆర్భాటంగా ధరణిని తీసుకోచ్చారు*
- *మేము తీసుకొచ్చిన భూ భారతి చట్టం పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ న్యాయం చేస్తుంది*
- *ధరణితో వచ్చిన నష్టాన్ని... కష్టాన్ని పూడ్చేందుకే కొత్త చట్టం తెచ్చాం*
* *తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
- *నేలకొండపల్లి మండలం సుర్దేపల్లిలో భూ భారతి చట్టం పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు*
*నేలకొండపల్లి : మొన్న వరంగల్ లో జరిగిన సభలో ఈ రాష్ట్రాన్ని చూస్తుంటే కడుపు మండుతోంది అని మాట్లాడారు కేసీఆర్ గారు... ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సన్న బియ్యం తింటున్నందుకా...! ఇందిరమ్మ ఇళ్లు పేదోళ్లకు ఇస్తున్నందుకా...? లేక రైతు సోదరులకు రుణమాఫీ సక్రమంగా చేసినందుకా...? ఎందుకు అని అడుగుతున్నాను అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
భూ భారతి - 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో భాగంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లిలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గత ప్రభుత్వం అనాలోచితంగా ... ఆర్భాటంగా ధరణి చట్టాన్ని రూపొందించిందన్నారు. పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వారందరికీ చట్టాన్ని చుట్టం చేశారని ఆరోపించారు. వారి హయంలో మూడున్నరేళ్ల పాటు ధరణి ఉన్నా కనీసం విధివిధానాలు రూపొందించలేదని విమర్శించారు. ధరణి చట్టం వల్ల ఎంతో మందికి నష్టం జరిగింది తప్ప లాభం జరగలేదని తెలిపారు.
ఆ నష్టాన్ని , కష్టాన్ని పూడ్చేందుకే భూ భారతి చట్టాన్ని ఇందిరమ్మ రాజ్యంలో.... సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకు రావడం జరిగిందన్నారు. 18 రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాక... ఆ చట్టాల్లో ఉన్న మంచి చెడులను అన్నింటినీ మేధావులు, రిటైర్డ్ అధికారులు, సీనియర్ కలెక్టర్లు తో చర్చించి పేదోళ్లకు న్యాయం జరిగే విధంగా భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. సమస్య ఏదైనా దానికి భూ భారతి తో శాశ్వత పరిష్కారం జరిగేలా ఈ చట్టం పనిచేస్తుందని తెలిపారు.
గత ప్రభుత్వం మాదిరిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే చట్టం పనిచేయదని పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి చెందిన వారైనా వారి సమస్యల్లో న్యాయం ఉంటే కచ్చితంగా వారికి ఈ చట్టం ద్వారా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మేము తీసుకొచ్చిన చట్టంలో విధి విధానాలను వందరోజుల్లోనే రూపొందించి వాటిని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం ఈ నెల 14వ తేదీన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి రోజున నిర్వహించడం జరిగిందన్నారు. ఈ చట్టం ప్రజలందరికీ చుట్టంలా పనిచేస్తుందని హామీ ఇచ్చారు.*
Comments
Post a Comment