యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

 యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం



నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఘటన


యూనిట్-1 ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ప్రమాదం


మంటలార్పిన ఫైర్ సిబ్బంది


సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మొదటి యూనిట్‌లోని బాయిలర్‌ నుంచి ఆయిల్‌ లీక్‌ అయింది. అదే సమయంలో కింద వెల్డింగ్‌ చేస్తుండగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి యూనిట్‌ మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో 600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. ట్రయల్‌ రన్‌కు సిద్ధమవుతుండగా ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.



ఈ ఏడాది ఫిబ్రవరి 14న కూడా యాదాద్రి పవర్‌ప్లాంటులో ప్రమాదం జరిగింది. యాష్‌ ప్లాంట్‌ ఈఎస్‌పీ వద్ద కాలిన బూడిద పడటంతో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంటులోని రెండో యూనిట్‌ నుంచి ప్రస్తుతం 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పతి చేస్తున్న క్రమంలో ఈఎస్‌పీ వద్ద యాష్‌ జామ్‌ కావడంతో ట్రిప్‌ అయ్యి బాయిలర్‌ నిలిచిపోయింది. జామ్‌ అయిన యాష్‌ను తొలగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా వేడి బూడిద మీడ పడి ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

Comments