ఏఐజీ ఆస్పత్రి పైకి ఎక్కి మహిళ హల్ చల్..
హైదరాబాద్‌లో బిజీగా ఉండే బంజారాహిల్స్ ఏరియాలో రెండున్నర గంటల పాటు హైడ్రామా నడిచింది. ఓ యువతి ఏఐజీ ఆస్పత్రి టెర్రస్ పైకి ఎక్కింది.
అక్కడ్నుంచి దూకేస్తానని బెదిరించింది. దాంతో ఆ రోడ్ పై వెళ్లేవారు ఏమవుతుందోనని ఉత్కంఠకు గురయ్యారు. పోలీసులు వచ్చారు. ఆస్పత్రి సిబ్బంది ఎవరూ తన దగ్గరకు రావొద్దని.. ఆమె ముందుగానే హెచ్చరించింది. ఫోన్లతో సంప్రందిపులు జరిపింది.
ఆమె భవనంపైకి ఎక్కి దూకుతానని బెదిరిస్తున్న వైనం వైరల్ కావడంతో యాజమాన్యం కూడా స్పందించింది.
భవనం పైకి ఎక్కిన మహిళను శివలిల గా గుర్తించారు. అదే ఆస్పత్రిలో ఆమె టెంపరరీ ఉద్యోగం చేశారు. అయితే ఇటీవల ఆమె ఉద్యోగం తొలగించారు.
ఈ కారణంగా ఆమె ఆస్పత్రి భవనంపైకి ఎక్కి.. తన ఉద్యోగం తనకు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఆమె టెర్రస్ పైనే నిలబడి రెండు గంటల పాటు చర్చలు జరిపారు.
ఆమె డిమాండ్లపై యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో ఆమె కిందకు దిగి వచ్చారు. దీంతో ఈ వ్యవహారంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బంజారా హిల్స్ లోని సిటీ సెంటర్ పక్కన ఏఐజీ ఆస్పత్రిని కొత్తగా నిర్మిస్తున్నారు. ఆ ప్రాంతం ఎప్పుడూ ట్రాఫిక్ తోబిజీగా ఉండే ఏరియా కాావడంతో ఆమె కారణంగా ట్రాఫిక్ చాలా సేపు అంతరాయం ఏర్పడింది.
Comments
Post a Comment