ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డు పై రైతుల ధర్నా
కూసుమంచి : మండలంలోని చేగొమ్మ డీసీసీబీ పరిధిలో గల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కాంటాలు పూర్తయిన ధాన్యం తరలించడానికి లారీలు లేవని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం ఉదయం సమయంలో ఆకస్మాత్తుగా వర్షం రావడం తో కొనుగోలు కేంద్రంలో అరబోసిన ధాన్యం కొంతమేర తడవడం తో ఆగ్రహించిన రైతులు సిపిఎం పార్టీ నాయకులతో కలిసి ఖమ్మం -సూర్యాపేట పాత రహదారి పై చేగొమ్మ క్రాస్ రోడ్డు పై రైతులు బైఠాయించి గంటన్నర సమయం పాటు రాస్తారోకో నిర్వహించారు.
దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నాగరాజు, వ్యవసాయ శాఖ అధికారిణి ఆర్.వాణి లు రైతులతో చర్చించి పై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
అనంతరం స సిపిఎం మండల కార్యదర్శి తోటకూరి.రాజు ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటిని కలిసి వినతిపత్రం అందజేసి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న సమస్యల గురించి వివరించారు.
తక్షణమే స్పందించిన మంత్రి ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడి నియోజకవర్గం మొత్తం అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు 24 గంటల లోపు కొత్త గన్ని బస్తాలు కొరత లేకుండా అందజేయాలని, సరిపడా లారీలు పంపాలని తెలిపారు.
అదేవిధంగా ఎక్కువ తరుగు తీస్తున్న మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని కూడా ఏదో ఒక పరిష్కారం చూపాలని అన్నారు. మరల రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మల్లేపల్లి మాజీ సర్పంచ్ రవి, పార్టీ డివిజన్ నాయకులు బిక్క సాని.గంగాధర్, శీలం.గురుమూర్తి,తదితర నాయకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment