కంటతడి పెట్టిన హరీష్ రావు ...

కంటతడి పెట్టిన హరీష్ రావు ...


నాన్న చనిపోతే అమ్మ కష్టపడి చదివిస్తోంది..

రాజకీయాల్లో ఆరితేరిన ఆజానుబాహుడు ఆయన. పార్టీకి కష్టం వస్తే.. ట్రబుల్ షూటర్‌గా ముందుండి నడిచే తెగువ ఆయనది. ప్రతిపక్ష నాయకులను అసెంబ్లీలో తన వాక్చాతుర్యంతో ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువు నీళ్లు తాగించే హరీశ్ రావు చిన్నపిల్లోడిలా కంటతడి పెట్టారు.


తాజాగా.. సిద్దిపేటలో "భద్రంగా ఉండాలి- భవిష్యత్ లో ఎదగాలి" పేరుతో పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులకు మోటీవేషన్ తరగతులు నిర్వహించారు. దీనికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హజరయ్యారు.

అప్పుడు ఒక చిన్నారి వచ్చి తన తండ్రిచిన్నప్పుడు చనిపోయారని.. తన తల్లి ఎంతో కష్టాలు పడుతూ చదివిస్తుందని తండ్రిని గుర్తు చేసుకునిమరీ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో హరీష్ రావు ఒక్కసారిగా ఆ చిన్నారిని ప్రేమతో హత్తుకున్నారు.

అంతేకాకుండా.. ఆ మాటలు విని ఒక్కసారిగా భావోద్వేగానికి సైతం గురయ్యారు. కన్నీళ్లు తుడుచుకుంటూ.. యువతిని సైతం ప్రేమతో ఓదార్చారు. 



ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు కన్నీళ్లు పెట్టుకొవడం చూసి అభిమానులు సైతం చాలా ఎమోషనల్ అవుతున్నారు.

Comments