వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ మృతి....
జడ్చర్ల పట్టణంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ లో 9 నెలలు నిండిన నిండు గర్భిణి ప్రసవం కోసం వచ్చి వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన శనివారం జడ్చర్ల మున్సిపాలిటీలో చోటుచేసుకుంది.
మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన రేణుక (21) గర్భం దాల్చినప్పటి నుండి హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రతినెల చికిత్స చేయించుకునేది.
9 నెలలు నిండడంతో జడ్చర్ల పట్టణంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ మా హాస్పిటల్ కు ప్రసవం కొరకు శుక్రవారం రాగా అక్కడి వైద్యురాలు నిలోఫర్ గర్భిణీ రేణుకను పరిశీలించి ఆసుపత్రిలో జాయిన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే మొదట గర్భిణీకి సుఖప్రసవం అయ్యే అవకాశం లేదని ఆపరేషన్ చేయాల్సి వస్తుందని శనివారం మధ్యాహ్నం వరకు ఆపరేషన్ చేద్దామని కుటుంబ సభ్యులకు తెలిపారు.
ఆపరేషన్ కు డబ్బులు అవసరం అవుతుందని తన గ్రామానికి వెళ్లి డబ్బులు తీసుకుని ఉదయానికల్లా వస్తానని చెప్పి రేణుక తల్లిని ఆస్పత్రి వద్ద ఉంచి భర్త నరేందర్ తన గ్రామానికి వెళ్లాడు.
ఇంతలోనే ఏమైందో ఏమో కానీ రాత్రి 11 గంటల తర్వాత గర్భిణి రేణుకకు అనస్తీషియా ఇచ్చారని, ఇచ్చిన అరగంట తర్వాత ఫిడ్స్ వచ్చాయని వైద్యురాలు నిలోఫర్ ఆస్పత్రిలోనే ఏవో చికిత్సలు అందించిందని తెలిపారు.
ఆ వెంటనే తన భార్యకు ఫిట్స్ వచ్చాయని వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తానన్నామని భర్త నరేందర్ కు ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేసి తెలిపారన్నారు. దీంతో వైద్యురాలు తన సొంత కారులో రేణుకను జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్ళిందని, అక్కడ పరిశీలించిన జిల్లా ఆసుపత్రి వైద్యులు అప్పటికే రేణుక మృతి చెందినట్లు ధృవీకరించారు.
కాగా అప్పటి దాకా ఆరోగ్యంగా ఉండి మాట్లాడిన రేణుకకు వైద్యులు ఇంజక్షన్ ఇచ్చాకే ఒక్కసారిగా ఫీడ్స్ రావడం ఏంటని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. నిండు గర్భిణీకి ఫీడ్స్ వచ్చి పరిస్థితి విషమంగా ఉంటే అంబులెన్స్ లో మరో ఆసుపత్రికి తరలించాలి కానీ ఆసుపత్రి వైద్యురాలు తన సొంత కారులో జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లడం ఏంటని ప్రశ్నించారు.
రేణుక జడ్చర్ల పట్టణంలోని మా ఆస్పత్రిలోనే వారి ఇచ్చిన ఇంజక్షన్ వికటించి మృతి చెందిందని, దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలోనే అంబులెన్స్ కు సమాచారం ఇవ్వకుండా తన సొంత వాహనంలో రేణుక మృతదేహాన్ని తీసుకెళ్లి తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని మృతురాలి భర్త నరేందర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ఘటన పై జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటన పై జిల్లా డీఎంహెచ్వో కార్యాలయం నుండి డీఎం మంజుల జడ్చర్ల పట్టణంలోని ఆస్పత్రిని సందర్శించి ఆసుపత్రిలో మృతురాలు రేణుకకు అందించిన వైద్య చికిత్సల పై ఆరా తీశారు.
ఆసుపత్రిలో ఉన్న నివేదికను జిల్లా ఉన్నత అధికారులకు అందజేస్తానని ఆమె తెలిపారు. కాగా ఆసుపత్రిలో నిబంధనల మేరకు ఏర్పాట్లు లేవని ఆస్పత్రిలోనే సీసీ ఫుటేజ్ కూడా రికార్డ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం తెలిపినట్లు ఆమె తెలిపారు.
Comments
Post a Comment