లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన మున్సిపల్ డీఈ

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన మున్సిపల్ డీఈ


ఏసీబీ అవినీతి అధికారుల భరతం పడుతోంది. ఒక్క రోజే పలు ప్రాంతాల్లో నలుగురు ప్రభుత్వ ఆఫీసర్లు లంచం తీసుకుంటుండగా పట్టుకుంది. 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సీఐ, జనగామ జిల్లా చిల్పూర్ తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారి,నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ పట్టుబడగా..లేటెస్ట్ గా లంచం తీసుకుంటూ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నాగారం మున్సిపల్ డీఈ రఘు ఏసీబీకి దొరికాడు. 1.30 లక్షలు డిమాండ్ చేశారు. 


అయితే బిల్లు చెల్లించడానికి డీఈఈ సుదర్శనం కాంట్రాక్టర్ వద్ద రూ. 1.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ రమేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.


రూ. లక్ష లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డీఈఈ సుదర్శనం తో పాటు మున్సిపల్ కార్యాలయం లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు (వర్క్ ఇన్స్పెక్టర్లు)గా పని చేస్తున్న వి. రాకేష్, వి.


సురేష్ లు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.


Comments