పర్యాటకుల మీద ఉగ్రవాదుల దాడులు పిరికిపంద చర్య

పర్యాటకుల మీద ఉగ్రవాదుల దాడులు పిరికిపంద చర్య

 

*TRS (D) వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ*


పర్యాటకుల మరణం  దురదృష్టకరం...వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...

జమ్ము కాశ్మీర్ పహేల్గావ్ లో ఉగ్రవాదుల దాడి పిరికి పంద చర్యగా అభివర్ణిస్తూ .దేశంలో శాంతి భద్రతల సమస్య ను రెచ్చగొట్టే చర్య....ప్రజాస్వామ్య వాదులందరు రాజకీయాలు పక్కన పెట్టీ ఈ చర్యను ఖండించాలి.

పలు ప్రాంతాల నుండి కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిలో 27 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం దారుణమైన సంఘటన



మరణించిన వారి కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి అని కోరుతున్నాం.  జమ్ము కాశ్మీర్ లో టెర్రరిస్టుల మారణకాండ పునరావృతం  కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో నాశనం చేయాలి.ఈ దాడుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, శోక తప్తులైన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.

Comments