కాశ్మీర్ నరమేధంపై
గర్జించిన ఐఎంఏ
సర్దార్ పటేల్ స్టేడియం నుండి డా.బీఆర్ అంబేద్కర్ సెంటర్ వరకూ కొవ్వొత్తుల ర్యాలీ
భారీగా తరలివచ్చిన ఖమ్మం ప్రయివేటు వైద్యులు
శాంతియుతంగా ర్యాలీ, కాశ్మీర్ మృతులకు నివాళులు
సి కె న్యూస్ ప్రతినిధి
భూ లోకంలో స్వర్గాన్ని తలపించే కాశ్మీర్‌లో నరమేథానికి పాల్పడి.. పచ్చని భూమిపై నెత్తుటి సంతకం చేసి యావత్ దేశాన్ని ఆందోళనకు గురిచేసి.. 28 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద మూకల దుశ్చర్యను ఖండిస్తూ బుధవారం రాత్రి ఖమ్మంలో ఐఎంఏ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. పర్యాటక ప్రాంతంగా దేశ విదేశాలనుండి పర్యాటకులు తరలివచ్చి ఆనందంగా గడిపే కాశ్మీర్‌లో ఉగ్రవాదులు నరమేథానికి పాల్పడి పచ్చని కాశ్మీర్‌ను నెత్తుటితో తడిపారని జమ్ము కశ్మీరులోని పహల్గాంలో మంగళవారం పర్యాటకులపై కాల్పులు జరిపి నరమేథానికి పాల్పడిన ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ ఖమ్మం లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఖమ్మంలో గర్జించింది. మానవ హననానికి పాల్పడిన దుర్మార్గులను అంతం చేయాలంటూ మృతిచెందిన విదేశీ, భారతదేశ పర్యాటలకులకు నివాళులు అర్పిస్తూ ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం నుండి డా.బీఆర్ అంబేద్కర్(జడ్పీ) సెంటర్ వరకూ కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు.
ఐఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.కే.జగదీష్ బాబు, ఐఎంఏ బాధ్యులు, సీనియర్ వైద్యులు డా.యలమంచిలి రవింద్రనాధ్, డా.కూరపాటి ప్రదీప్‌కుమార్, డా.గోంగూర వెంకటేశ్వర్లు, డా.సతీష్‌బాబు, డా.కుసుమరాజు రవికుమార్, డా.వై. ప్రసాద్, డా.సునీల్‌కుమార్ జంగాల, డా.రెహనాబేగం, డా.కేవీ కృష్ణారావు, డా.బాబూ రత్నాకర్, తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైద్యులు శాంతి ర్యాలీకి తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...భారతదేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇలాంటి నరమేథానికి పాల్పడటం హేయమైన చర్య అని ఖండిరచారు. మొత్తం 28 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను వెంటాడి, వేటాడి అంతం చేయాల్సిందేనని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
వైద్యుల నినాదాలతో దద్దరిల్లిన డా.బీఆర్ అంబేద్కర్ సెంటర్
పర్యాటక ప్రాంతంగా దేశ విదేశాలనుండి పర్యాటకులు తరలివచ్చి ఆనందంగా గడిపే కాశ్మీర్‌లో ఉగ్రవాదులు నరమేథానికి పాల్పడి పచ్చని కాశ్మీర్‌ను నెత్తుటితో తడిపారని ఇది అత్యంత విషాధకమరి ఖమ్మం వైద్యులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తొలుత సర్దార్ పటేల్ స్టేడియం నుండి కొవ్వొత్తులతో ర్యాలీగా బయలు దేరి డా.బీఆర్ అంబేద్కర్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ జై హింద్ నినాదాలు చేస్తూ కాశ్మీర్ మృతులకు నివాళులు అర్పించారు. ఇలాంటి దుర్మార్గపు ఘటనకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఉగ్రవాద మూకలను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని ఐఎంఏ ప్రతినిధులుగా ఉన్న వైద్యులు నినాదాలు చేశారు.
ప్రశాంతతకు మారుపేరు, భూ లోకంలో స్వర్గంలా ఉండే కాశ్మీర్‌పై పర్యాటకులకు భయం కలిగేలా ఏకే 47 గన్‌లతో దాడులకు దిగడమే కాకుండా విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అన్యాయంగా 28మందిని మృత్యువు ఒడిలోకి చేర్చారని మండి పడ్డారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని ఖమ్మం ప్రయివేటు వైద్యులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇలాంటి కవ్వింపు చర్యలతో భారతదేశంలోని సమగ్రత, సమైక్యతను దెబ్బతీయలేరని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రయివేటు వైద్యులు డా.సుదీంద్ర రెడ్డి, డా.జంగాల స్వాతి, డా.సిద్ధికి, డా.ప్రియాంక, హాస్పిటల్స్ సిబ్బంది, వివిధ ప్రయివేటు హాస్పిటళ్ల యాజమాన్యాలు, సహాయకులు, టెక్నికల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment