BRS పార్టీ మద్దతుతో గెలిచిన నీకు బీఆర్ఎస్ ను విమర్శించే స్థాయి లేదు... పగడాల నాగరాజు

BRS పార్టీ మద్దతుతో గెలిచిన నీకు బీఆర్ఎస్ ను విమర్శించే  స్థాయి లేదు... పగడాల నాగరాజు

బీఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశం 


ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో 'నగర కమిటీ' ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభ ప్రజల విశేష మద్దతుతో ఘన విజయంగా ముగిసిందని పేర్కొన్నారు.

 లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలివచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.సభకు అడ్డంకులు కలిగించేందుకు కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రయత్నాలను తీవ్రంగా ఖండించిన నాగరాజు... ఇందిరమ్మ ఇండ్ల ఎంక్వయిరీ పేరుతో ప్రజలను మీటింగ్ కు రాకుండా బెదిరించారని ఆరోపించారు. 

అయినప్పటికీ ప్రజలు “జై తెలంగాణ” నినాదాలతో ఉత్సాహంగా సభలో పాల్గొన్నారని చెప్పారు. కేసీఆర్ ప్రసంగానికి సభా ప్రాంగణంలో మరియు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కోట్లాది మంది ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక విఫలమై, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. పువ్వాడ అజయ్ కుమార్ గారి పాలనలో ఖమ్మం నియోజకవర్గానికి భారీగా అభివృద్ధి జరగిందన్నారు. 

గత ప్రభుత్వం పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సస్పెన్షన్ బ్రిడ్జి, మున్నేరు కాంక్రీట్ వాల్, రఘునాథపాలెం నుండి బూడిదంపాడు వరకు నాలుగు లైన్ ల రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు తప్ప ఖమ్మానికి మీరు స్వతహాగా తెచ్చిన నిధులుగాని చేసిన పనిగాని ఏమిలేదన్నారు


-మున్సిపల్ అభివృద్ధి పనులపై ఆగ్రహం:

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో డివిజన్ లలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రాంట్ చేసిన  అభివృద్ధి పనులను నిలిపివేసిందని, కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావస్తున్నా ఇంతవరకు డివిజన్ లలో ఒక్క పనికూడ జరగలేదన్నారు. 

కార్పొరేటర్లు డివిజన్ లలో అభివృద్ధి పనులకోసం రిప్రజెంటేషన్ ఇచ్చినా ఏ పని కూడా ప్రారంభించలేదని మండిపడ్డారు. మున్నేరు సీసీ వాల్ నిర్మాణంలో భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా దేనికి పనికిరాని ప్లాట్స్ ఇచ్చి చేతులు దులుపుకుందాము అని చూస్తున్నారన్నారు. ఇంతవకు వారికీ న్యాయం జరగలేదని అన్నారు.

కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, మక్బుల్, తాజుద్దీన్ స్పందన:

కాంగ్రెస్ నేత మురళి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ గారిని విమర్శించే స్థాయి మురళికి లేదని ధ్వజమెత్తారు. 

BRS పార్టీ మద్దతుతో గెలిచిన నువ్వు  బీఆర్ఎస్ నాయకులను విమర్శించే  స్థాయి ఎక్కడిదన్నారు. తుమ్మల నాగేశ్వరావు సత్తుపల్లి ,ఖమ్మం ,పాలేరు నియోజక వర్గాలలో ఓడిన చరిత్ర ఉంది వారినికూడ ప్రజలు బొంద పెట్టినట్టా అని ప్రశ్నించారు

 నువ్వు ఎంత చించుకున్న నీకు పదవులు రావు నీకన్నా కాంగ్రేస్ పార్టీలో సీనియర్లు చాలామంది వున్నారు వారికే ఇంతవరకు గతిలేదు. నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడితే మంచిదని  ధైర్యం ఉంటే BRS పార్టీ సింబల్ మీద గెలిచిన నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ పార్టీ  ప్రజలను మోసం చేసిందని, పాలనలో తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని విమర్శించారు. పువ్వాడ అజయ్ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తుపెట్టుకున్నారని, మళ్ళీ బీఆర్ఎస్‌కు అవకాశమివ్వాలని భావిస్తున్నారని తెలిపారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్ బుర్రి వెంకట్, పసుమర్తి రామ్మోహన్, జ్యోతి రెడ్డి, భోజడ్ల రామ్మోహన్, ఎచ్చు  ప్రసాద్, ఆరెంపుల వీరభద్రం, సత్తార్  తదితరులు పాల్గొన్నారు.

Comments