తెలంగాణ ఎప్‌సెట్ 2025 ఫలితాలు విడుదల... చెక్ చేసుకోండి ఇలా..

తెలంగాణ ఎప్‌సెట్ 2025 ఫలితాలు విడుదల... చెక్ చేసుకోండి ఇలా..


తెలంగాణ ఎప్‌సెట్ 2025 ఫలితాలు  ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఈ మేరకు ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు (Ranks), మార్కుల (Marks) జాబితాను కూడా వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. 

ఇటీవల తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తంగా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఎప్‌సెట్‌కు హాజరయ్యారు.

టీజీ ఈఏపీసెట్‌ ఫలితాలతో పాటు తెలంగాణ ఈఏపీసెట్‌ కౌన్సిలింగ్‌ తేదీలను కూడా ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ https://eapcet.tgche.ac.in/ చూడొచ్చు. రిజల్ట్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. 


విద్యార్థులు ఈఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేయడంతో విద్యార్జులు ఫలితాలను సెల్‌ఫోన్‌ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఇంజినీరింగ్‌ విభాగం, అగ్రికల్చర్‌ ఫార్మా విభాగం ఆన్సర్‌ కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్‌తో సంబంధం ఉన్న అధికారులు పాల్గొన్నారు.

Comments