పాకిస్తాన్ కాల్పుల్లో ప్రాణాలు విడిచిన మరో వీర జవాన్!
హైదరాబాద్:మే 10
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉన్నాయి.. పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో ప్రాణనష్టం తప్పడంలేదు.. సాధారణ ప్రజలు కొందరు ప్రాణాలు కోల్పోగా.. శత్రుదేశంతో పోరాడుతూ కొందరు జవాన్లు వీరమరణం పొందుతున్నారు..
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాకు చెంది న వీర జవాన్ మురళీ నాయక్, వీరమరణం పొందగా.. ప్రభుత్వ లాంఛ నాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది..
మరోవైపు.. ఈ రోజు పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం పొందారు.. జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే ప్రాణాలు విడిచారు.. సచిన్ యాదవ్ రావు వనాంజే వయస్సు 29 ఏళ్లు.. ఆయన స్వస్థలం మహారాష్ట్ర – తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్…
సచిన్ యాదవ్‌రావు వనాంజే మృతితో తమ్లూర్ లో విషాదచాయలు అలు ముకున్నాయి.. ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు గా విలిపిస్తున్నారు.. అయితే, ఇవాళ స్వస్థలానికి సచిన్ యాదవ్‌రావు వనాంజే పార్థివదేహాన్ని తరలించేందుకు ఇండియన్ ఆర్మీ ఏర్పాట్లు చేస్తోంది..
Comments
Post a Comment