మానవత్వం చాటుకున్న ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

 *మానవత్వం చాటుకున్న ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి*



* ప్రత్యేక శ్రద్ధ చూపి ఆటో డ్రైవర్ కుమారుడి బోన్ మ్యారో చికిత్సకు రూ.3 లక్షల పీఎంఆర్ఎఫ్ ఎల్ ఓసీ మంజూరు 


*ఖమ్మం:* "సారూ.. నా బిడ్డను బతికించండయ్యా. రేక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. ఆదుకోండయ్యా.." అని వైరా పాత తండాకు చెందిన ఆటో డ్రైవర్ బానోత్ సైదులు..చేసిన విజ్ఞప్తికి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి వెంటనే.. స్పందించి ఆ కుటుంబానికి కొండంత భరోసానిచ్చారు. ఆటో డ్రైవర్  బానోతు సైదులు కుమారుడైన ఏడేళ్ల ఉపేందర్ బోన్ మ్యారోకు సంబంధించిన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతుండగా అతడి తల్లిదండ్రులు పది రోజుల కిందట ఎంపీ రఘురాం రెడ్డిని కలిసి వివరించి చికిత్స చేయించేందుకు తమకు ఆర్థిక స్థోమత లేదని వివరించారు. 



వారి గోడు విని, అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పసి బాలుడి బాధను చూసి ఎంపీ రఘురాం రెడ్డి చలించారు. వెంటనే ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్(పీఎంఆర్ ఎఫ్)కు దరఖాస్తు చేయించి, ప్రత్యేక శ్రద్ధతో ఢిల్లీలోని కార్యాలయ సంబంధిత అధికారులను సంప్రదించి.. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్ర చికిత్స కోసం రూ. 3లక్షల ఎల్ఓ సీ పత్రం మంజూరు చేయించారు. ఈ మేరకు ఎంపీ రామ సహాయం ఆదివారం తన నివాసంలో సదరు ఆటో డ్రైవర్ కుటుంబానికి అందజేశారు. ఆ బాలుడి ఆపరేషన్.. విజయవంతం కావాలని, వారి ఇంట మళ్లీ ఆనందాలు విరబూయాలని ఈ సందర్భంగా ఎంపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Comments