వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా... నేవి ఉద్యోగి భార్య మృతి

వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా... నేవి ఉద్యోగి భార్య మృతి

ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తాపడగా అందులో ప్రయాణిస్తున్న నేవి ఉద్యోగి భార్య అక్కడిక్కడే మృతి చెందిన ఘటన సదాశివ నగర్ మండలం మర్కల్ స్టేజి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. 

సెలవులు రద్దు కావడంతో విధుల్లో చేరడానికి భార్యతో కలిసి బయలుదేరాడు ఓ నేవీ ఉద్యోగి. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా పడటంతో భార్య మృతి చెందగా సీట్ బెల్టు అతని ప్రాణాలను కాపాడింది. 

ఈ ఘటన సదాశివనగర్ మర్కల్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ కు చెందిన రౌత్ అముల్ విశాఖపట్నం నేవీ లో విధులు నిర్వర్తిస్తున్నాడు.



సెలవులు ఉండటంతో ఆదిలాబాద్ కు వెళ్లిన అముల్ సెలవులు రద్దయ్యాయని తెలిసి భార్య అరి ప్రణీత (19) తో కలిసి కారులో విశాఖపట్నం బయలుదేరాడు. సాయంత్రం మర్కల్ చౌరస్తా వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో కారు బోల్తా పడింది.

 ఈ ఘటనలో అరి ప్రణీత అక్కడికక్కడే మృతి చెందగా సీటు బెల్టు పెట్టుకోవడంతో అముల్ ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments