కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసులు
మాజీ మంత్రి కొడాలి నానికి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న నోటీసులు జారీ చేశారు కృష్ణా జిల్లా పోలిసులు. కొడాలి నానిపై అనేక కేసులు విచారణ దశలో ఉన్నాయని, ఈ సమయంలో వైద్య చికిత్స పేరుతో అమెరికా వెళ్ళిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు డీజీపీ కి టీడీపీ ఫిర్యాదు చేసింది.
ఈ నోటీసులు ఆన్‌లైన్ ద్వారా అన్ని ఎయిర్‌పోర్టులు, ఓడరేవులకు అందాయి. వాస్తవానికి కొడాలి నానికి రాష్ట్రంలో పాస్‌పోర్టు లేదు. రైతు మోషే కేసులో జైలుశిక్ష ఖరారుకావడం, పలు కేసుల్లో నిందితునిగా ఉండటంతో ఆయనకు పాస్‌పోర్టు జారీ కాలేదు. అయితే, హైదరాబాద్ చిరునామాతో పాస్‌పోర్టును పొంది ఉంటారని అనుమానిస్తున్నారు.
అమెరికాకుపరారయ్యే అవకాశం ఉందని సందేహిస్తున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ పరిధిలో నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.
వలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, విశాఖపట్నంలో కేసుకు సంబంధించి నాని ముందస్తు బెయిల్ పొందారు.
గుడివాడ మండలం మల్లాయిపాలెం జగనన్న కాలనీకి మెరక పేరుతో రూ.కోట్లు దోపిడి చేసిన వ్యవహారంలో నమోదైన కేసులో నానిపై దర్యాప్తు పురోగతిలో ఉంది.
Comments
Post a Comment