హైడ్రా లో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు!
హైదరాబాద్:మే 19
హైడ్రాలో డ్రైవర్లుగా పనిచేసేందుకు తెలంగాణ జిల్లాల నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో యువత హైదరాబాద్ కు చేరుకున్నారు. అవుట్సో ర్సింగ్ విధానంలో 200 డ్రైవర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల హైడ్రా నోటిఫికేషన్ జారీ చేసింది, దీంతో హైదరాబాద్‌లోని హైడ్రా సంస్థలో ప్రకటించిన డ్రైవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈ ఉద్యోగాలు ఆధ్వర్యం లోని వివిధ విభాగాలలో 200 ఖాళీలను భర్తీ చేసేం దుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టులన్నీ విపత్తు నిర్వహ ణ, ప్రభుత్వ ఆస్తుల పర్య వేక్షణ వంటి విభాగాలకు చెందిన వాహనాలు నడప డానికి సంబంధించినవిగా సమాచారం.
ఈ ఉద్యోగాలకు డ్రైవింగ్ లైసెన్స్, సంబంధిత డ్రైవిం గ్ అనుభవంతో పాటు గత సంవత్సరం స్వల్ప మార్కులతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దూరమైన అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులుగా హైడ్రా పేర్కొంది.
అందులో భాగంగా తెలం గాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదికలో పేర్లు ఉన్నవారి దరఖాస్తు లు మాత్రమే సిబ్బంది స్వీకరించారు. కాగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వేల సంఖ్యలో నిరుద్యోగులు హైదరాబాద్ లోని హైడ్రా కార్యాలయానికి క్యూ కట్టడం గమనార్హం.
Comments
Post a Comment