మంత్రి ఉత్తమ్ కు తప్పిన పెను ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. హుజూర్ నగర్ (మం) మేళ్లచెరువులో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ వాతావరణ శాఖ సూచన మేరకు అత్యవసరగా కోదాడలో ల్యాండింగ్ అయింది.
వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు అత్యవసరంగా ల్యాండ్ అయినట్టు తెలిసింది. వివరాల ప్రకారం.. మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
హుజూర్‌నగర్ మండలం మేళ్లచెరువులో హెలికాఫ్టర్ ల్యాండ్ కావాల్సి ఉండగా.. వాతావరణశాఖ అధికారుల సూచన మేరకు అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపథ్యంలో పైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో, అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం, మంత్రి ఉత్తమ్ కుమార్.. కోదాడ నుంచి హుజూర్ నగర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు.
Comments
Post a Comment