ఇరానీ హోటల్ వద్ద కలకలం

ఇరానీ హోటల్ వద్ద కలకలం 

యువకుల మధ్య ఘర్షణ


ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద ఓ ఇరానీ చాయ్ హోటల్ వద్ద కొందరు యువకులు వచ్చి తాగారు. అక్కడ షాపు ఓనర్ కు, యువకులకు మధ్యలో మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో ఛాయ్ దగ్గర గొడవ జరిపిన యువకులు నిజాం పేటకు చెందిన యువకులకు ఫోన్ చేసి విషయం చెప్పారు.

 వారు కొంత మంది గ్యాంగ్ లాగా తయారు అయ్యి స్టేషన్ రోడ్డు వద్ద ఉన్న ఇరానీ చాయ్ హోటల్ వద్దకు వెళ్లి నానా హంగామా సృష్టించారు. హోటల్ లో టేబుల్, ఫ్రిజ్ ను కింద పడేసి గొడవ చేశారు. ఈ తతంగమంతా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట జరుగుతుండగా పోలీసులు రంగంలోకి దిగి అక్కడ ఉన్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. 

విషయం తెలుసుకున్న వన్ టౌన్ సీఐ కరుణాకర్ స్టేషన్ వచ్చి గొడవ జరిగిన విషయాలను తెలుసుకొని యువకులను గట్టిగా మందలించిన్నట్లు సమాచారం. ఇరువురు రాజీ పడడంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

వన్ టౌన్ ప్రాంతంలో ఏం జరుగుతుంది..

వన్ టౌన్ పోలీస్ ఎదుట వరుసగా ఇరానీ ఛాయ్ హోటల్లు, బిర్యానీ హోటల్లు ఉన్నాయి. అవీ రాత్రి 11 గంటలకు బంద్ చేయాలి, కానీ షాపు నిర్వాహకులు అర్ధరాత్రి వరకు హోటల్ ను నడిపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట బహిరంగంగా హోటల్ నడుస్తున్న పోలీసులు చూసి చూడనట్టు ఉండడం వల్ల హోటల్ నిర్వాహకులు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నట్లు సమాచారం.



 రాత్రిపూట మద్యం, గంజాయి సేవించి కొంతమంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. కొన్ని సంఘటనలు చోటు చేసుకున్న పోలీసులు రెండు మూడు రోజులు హడావుడిగా చేయడం తప్ప ఏమీ ఉండదని ప్రజల చెబుతున్నారు.

 ఇప్పటికైనా రైల్వే స్టేషన్ బయట జరుగుతున్న హొటల్ వ్యాపారాన్ని సమయానికి బంద్ చేపించి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Comments