రైతుల వెన్ను విరుస్తున్న ఏ ఈ ఓల చేతి వాటం ....
ప్రతి రైతు నుంచి 50 రూపాయలు వసూలు .....
కేంద్ర ప్రభుత్వం నుంచి ఏఈఓ లకు అదనపు పని భారం కింద ఒక కేవైసీకి 15 రూపాయలు చొప్పున ఏఈఓ లకు అందుతుందన్న సమాచారం..
బ్రేకింగ్ న్యూస్
పెబ్బేరు మండలంలోని కొంతమంది ఏఈవోలు రైతులను పట్టిపీడిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం సీకే న్యూస్ కు అందింది.
పెబ్బేరు మండలం సూగూరు గ్రామానికి చెందిన ఏఈఓ ఆంజనేయులను వివరణ కోరగా ప్రతి రైతు నుంచి పీఎం కిసాన్ పథకం సంబంధించి రిజిస్టర్ కేవైసీ కొరకు రైతులు మీ దగ్గరికి వస్తే మీకు సంబంధించిన(ప్రైవేట్ ఇంటర్నెట్ సంస్థ హనుమాన్ ఇంటర్నెట్)ఇంటర్నెట్ సిబ్బందికి ఏ ఈ ఓ లాగిన్ పాస్వర్డ్ ఇచ్చి పీఎం కిసాన్ పథకం అప్లై చేయడానికి వచ్చిన రైతులకు పలాన ఇంటర్నెట్ దగ్గరికి వెళ్ళమని చెప్పడం అక్కడ ఒక్కో రైతు చొప్పున 50 రూపాయలు వసూలు చేస్తున్నారని అడగగా..
వీటికి సంబంధించిన ఆదేశాలు సీఎస్సీ ఇవ్వమని చెప్పారని చెప్పడం జరిగింది. ఇట్టి విషయంపై సిఎస్సి గారికి ఫోన్ చేయగా లాగిన్ కి సంబంధించి పాస్వర్డ్ కేవలం సంబంధిత ఆఫీసర్ కి మాత్రమే ఇవ్వడం జరిగిందని ఎవరికి కూడా లాగిన్ ఇవ్వకూడదని సమాధానం చెప్పారు...
కానీ ఇక్కడ ఏఈఓ మరియు ఇంటర్నెట్ వ్యక్తులు రైతుల నుంచి వసూలు చేసిన 50 రూపాయలు సాయంకాలం పంచుకోవడం జరుగుతుందని తెలిసింది.ఇలా ప్రభుత్వానికి సంబందించిన లాగిన్ పాస్వర్డ్ ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళడం సరికాదు..ఒక వైపు అకాల వర్షాలతో వడ్లు నాని సతమతం ఐతున్న రైతులను ఇలా ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులు రాబందుల్లా పీక్కుతినడం ఎంతవరకు సమంజసం.
ఈ సమస్య కేవలం సుగూరు గ్రామానికే కాదు మరి కొన్ని గ్రామాలలో ఇదే తంతు నడుస్తుందని క్షేత్రస్థాయిలో సికే న్యూస్ బృందం పర్యటించి సమాచారాన్ని సేకరించింది..ఈ విషయం మీద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ అట్టి అధికారుల మీద సత్వరం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది..
Comments
Post a Comment