పోలీస్ స్టేషన్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం..

పోలీస్ స్టేషన్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం..

తన సమస్యను పరిష్కరించలేదని నిరసిస్తూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ ముందు బండరాయితో తల బాదుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం పోలీస్ స్టేషన్ ముందు మంగళవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తాడూరు మండలం యాదిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన మేకల కావేరి, రామకృష్ణ లు బతుకుదెరువు కోసం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సెలవుల నేపథ్యంలో తిరిగి సొంత గ్రామానికి వెళ్లారు. గత రెండు రోజుల క్రితం తన భర్తకు, మరిది ఫోన్ కి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుండి అనుమానాస్పద ఫోన్ వచ్చింది.

భార్యపై అనుమానం పెంచుకుని వేధిస్తున్నాడని కావేరి తమ్ముడు చెప్పాడు. దీంతో అనుమానిత వ్యక్తి నెంబర్ పై తాడూరు మండల పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. తానిచ్చిన ఫిర్యాదు పై పోలీసులు స్పందించడం లేదని నిరసిస్తూ మంగళవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ ముందు బండరాళ్లతో తలపై బాదుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.



తల పై నాలుగు కుట్లు పడినట్లు సమాచారం. ఇదే విషయంపై తాడూర్ ఎస్సై గురు స్వామి ని వివరణ కోరగా.. బాధితురాలు నాలుగు రోజుల క్రితం వచ్చి వెళ్ళింది. అతడి ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి ఆరా తీశాను.

అంతలోనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. స్టేషన్ ముందు తలపై కొట్టుకోలేదు. తన భర్త వేధింపుల కారణంగా మహిళ ఇలా చేసుకుని ఉంటుంది. దీనిపై ఇవాళ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. డినిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Comments