పాతబస్తీలో భారీ అ‍గ్ని ప్రమాదం.. మంటల్లో పది మంది

పాతబస్తీలో భారీ అ‍గ్ని ప్రమాదం.. మంటల్లో పది మంది

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో భారీ అ‍గ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మహారాజ్‌గంజ్‌లోని స్క్రాప్‌ గోదాం(ప్లాస్టిక్‌ గోడౌన్‌)లో మంటలు ఎగిసిపడి మూడు అంతస్తులకు వ్యాపించాయి.

ఈ ప్రమాదంలో పది మంది మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు, మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది

వివరాల ప్రకారం.. పాతబస్తీలో గురువారం ఉదయం ప్లాస్టిక్‌ గోడౌన్‌కు మంటలు వ్యాపించాయి. అనంతరం, పక్కనే ఉన్న మూడు అంతస్తు భవనంలోకి మంటలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్‌ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఇప్పటి వరకు అగ్నిమాపక సిబ్బంది ఆరుగురిని రక్షించారు. అగ్ని ప్రమాదం నుంచి కాపాడిన వారిలో చిన్నారి కూడా ఉంది. దీంతో, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

అయితే, మొదటి అంతస్తులో డిస్పోజబుల్‌ ప్లేట్స్‌ గోడౌన్‌, రెండో అంతస్తులో యజమాని నివాసం ఉంటున్నారు. ఇక, మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న మరో కుటుంబం.

 ప్లాస్టిక్‌ సమాన్లు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఫైర్‌ సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Comments