డివి నాయక్ అకాడమీ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

డివి నాయక్ అకాడమీ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి


*విద్యార్థి కార్తీక్ కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి*


*ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంధసిరి జ్యోతి బసు, పట్ల మధు*


*ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి కార్తిక్ డెడ్ బాడీ ఉన్న మార్చరీ ముందు ధర్నా*

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డి వి నాయక్ అకాడమీ నిర్లక్ష్యం కారణంగా మరణించిన కార్తీక్ కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంధసిరి జ్యోతి బస్సు పట్ల మధు డిమాండ్ చేశారు 

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కార్తీక్ మృతదేహం ఉన్న మార్చరీ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డి వి నాయక్ అకాడమీ విద్యార్థులకు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడం వల్లే కార్తీక్ విద్యుత్ షాక్ తో మరణించాడని మండిపడ్డారు.. 

పేద విద్యార్థుల దగ్గర నుండి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా విద్యుత్ మెయిన్ లైన్ పక్కనే అకాడమీ ఏర్పాటు చేసిందని తెలియజేశారు విద్యార్థి మృతి చెందగానే పారిపోయిన డివి నాయక్ డిఫెన్స్ అకాడమీ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఇలా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డివి నాయక్ అకాడమీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు 

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సింహద్రి,జిల్లా సహయ కార్యదర్శి ‌నిక్షిప్త, పట్టణ కార్యదర్శి గుండ్ల రాకేష్ జిల్లా నాయకులు మురళి శరత్ మహేష్ వినోద్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Comments