నవీన్ కుటుంబానికి కెఎచ్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందజేత

 *యాక్సిడెంట్ లో  తీవ్రగాయాలయ్యాయిన చికిత్స నిమిత్తం సంగపాక నవీన్ కుటుంబానికి కెఎచ్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందజేత*

సి కె న్యూస్ ఆత్మకూర్ ఎం రిపోర్టర్ షేక్ అజీజ్ 

యాదాద్రి భువనగిరి జిల్లా

ఆత్మకూరు (ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన సంగపాక శివయ్య కుమారుడు నవీన్ తన ద్విచక్రవాహనంపై హైదరాబాద్ మార్గంలో వెళ్తున్నపడు భువనగిరి మార్గం దగ్గర ఎదురుగా వస్తున్న కారు తన ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టడంతో ఛాతీలో ఎముకలు విరిగి ఊపిరితిత్తులకి తాకడంతో తీవ్రగాయాలయ్యాయి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు 

వారిది నిరుపేద కుటుంబం కావడంతో *కెఎచ్ఆర్ ఫౌండేషన్ అధినేత బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొప్పుల హరిదీప్ రెడ్డి* సహకారంతో పల్లెర్ల బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక  సహాయాన్ని అందజేశారు. 



ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు సామ నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు లక్ష్మీ రామలక్ష్మయ్య, నిమ్మరెడ్డి నరేందర్ రెడ్డి, లోడి రాజేందర్, సోలిపురం వెంకట్ రెడ్డి, కంబాలపల్లి సురేందర్, ఆంబోజు నాగయ్య, మంగ శ్రీనివాస్, అశోక్ రెడ్డి,పెసరకాయల నర్సిరెడ్డి, యూత్, విద్యార్థి నాయకులు యాట మల్లికార్జున్, జనపాల శేఖర్, దండు మల్లేష్, దండు నవీన్, శశి, అజయ్, తదితరులు పాల్గొన్నారు.

Comments