నగరంలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్...
హైదరాబాద్ మహా నగరంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. అర్ధరాత్రి రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతూ.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి తాగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని సర్దార్ పటేల్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి గంజాయి మత్తులో జోగుతూ..
కొందరు యువకులు కాలనీలో వీరంగం సృష్టించారు. ఈ క్రమంలోనే గొడవ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించిన యువకుడు వెంకటరమణపై పవన్ అతడి గ్యాంగ్ మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.
అనంతరం వారు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ దాడిలో వెంకటరమణకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికుల మాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Comments
Post a Comment