మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే కన్నుమూత



 ఆర్ఎస్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కన్నుమూశారు. గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఎఐజీ హాస్పిటల్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ లాల్ ...



అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. 2018,2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నారు మదన్ లాల్.

*మదన్ లాల్ మృతికి మంత్రి పొంగులేటి సంతాపం*


*ఖమ్మం :  వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ మృతి పట్ల తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా గతంలో వైసీపీ, బీఆర్ఎస్ లో ఉన్నపుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మదన్ లాల్ మృతి వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్ధించినట్లు తెలిపారు.*

Comments