రాత్రి పగలు కృషి చేసి యుద్ధాన్ని ఆపాను : కేఏ పాల్
భారత్ - పాకిస్తాన్ మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు శనివారం సాయంత్రం నుంచి తాత్కాలికంగా తెరపడినట్లయింది. కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించిన ప్రకారం, సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు.
శనివారం సాయంత్రం 5 గంటల నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చందని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.
ఈనెల 12వ తేదీన భారత్ - పాక్ మధ్య ప్రత్యక్ష చర్యలు ఉంటాయని.. ప్రత్యక్ష చర్చల తర్వాతే కాల్పుల విరమణపై ఇరు దేశాలు నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ''గత కొన్ని రోజులుగా భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. రాత్రి పగలు కృషి చేసి భారత్- పాక్ యుద్ధాన్ని ఆపాను. అమెరికాలో రిపబ్లికన్స్, డెమోక్రాట్స్, ఇరు దేశాల నేతలను కలిశాను.
యుద్ధం ఆపేలా ప్రయత్నం చేశాను'' అని చెబుతూ వీడియో విడుదల చేశారు. అంతకుముందు భారత్- పాకిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో శనివారం సాయంత్రం ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు ట్రంప్ ధన్యవాదాలు చెప్పారు.
Comments
Post a Comment