గుండెపోటుతో జూలూరుపాడు యువకుడు మృతి..

గుండెపోటుతో జూలూరుపాడు యువకుడు మృతి..

గుండెపోటుతో జూలూరుపాడు గ్రామానికి చెందిన తెగిలిచర్ల రాకేష్ శర్మ(33) అరుణాచలంలో ఆదివారం మృతి చెందాడు.

వివరాల్లోకెళ్తే తల్లి భవాని ని తీసుకుని రెండు రోజుల క్రితం రాకేష్ తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం దైవ దర్శనానికి వెళ్ళాడు. తల్లి కొడుకులు ఇద్దరు కలిసి గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. 

అనంతరం ఆటోలో రూముకు వస్తుండగా రాకేష్ కు గుండెపోటు రావడంతో మృతి చెందాడు. రాకేష్ హైదరాబాద్ లో ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. 



అతని తండ్రి మధు కుమార్ శర్మ పాపకొల్లు గ్రామంలో ఉమా సోమలింగేశ్వర స్వామి ఆలయ పురోహితుడిగా పనిచేస్తున్నాడు. మృతుడికి భార్య, మూడేళ్ల కుమారుడు, ఆరు నెలల కుమార్తె ఉన్నారు. 

మాతృ దినోత్సవం రోజున ఈ సంఘటన చోటు చేసుకోవడం విషాదాన్ని నింపింది. యువకుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments